navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 5:08 pm Digital Edition : NAVAGEETAM

మంత్రి అడ్లూరిని కలిసిన జనతా బీడీ కంపెనీ అధినేతలు

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మెట్ పల్లి జనతా బీడీ కంపెనీ, రాకెట్ టీ కంపెనీ అధినేతలు ఎండి సోహెల్, ఎండి తలహ లు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు లతో కలిసి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ అని సోహైల్, తలహ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నందయ్య, మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేత షేక్ మహమ్మద్, నాయకులు చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.