navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 9:46 am Digital Edition : NAVAGEETAM

మంత్రి అడ్లూరి ని మర్యాద పూర్వకంగా కలిసిన నూతన కార్యదర్శి

నవగీతం, హైదరాబాద్:

తెలంగాణ సోషల్ వెల్పెర్  రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూషన్స్ సొసైటీ  (TGSWREIS) కార్యదర్శిగా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ (SCDD) కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయేంద్ర బోయి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాఖ పరిధిలో అమలవుతున్న సంక్షేమ, విద్యా కార్యక్రమాల పురోగతిపై చర్చించారు. గురుకుల విద్యాసంస్థల అభివృద్ధి, విద్యార్థుల సౌకర్యాల మెరుగుదల, పరిపాలన బలోపేతంపై మంత్రి సూచనలు చేశారు.సాంఘిక సంక్షేమ శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని విజయేంద్ర బోయి తెలిపారు