navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 9:26 pm Digital Edition : NAVAGEETAM

మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి: జనసేన నాయకులు

మెట్ పల్లి, సెప్టెంబర్ 13 (నవగీతం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మెట్ పల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఎలాగందుల అజయ్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు. మట్టి విగ్రహాల వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు అబ్బూరి ఆనంద్, మేడారపు మారుతి, కడారి శ్రీకాంత్, కిషోర్, రాంప్రసాద్, లింగమూర్తి, చందు, శ్రీధర్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.