మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి: జనసేన నాయకులు

మెట్ పల్లి, సెప్టెంబర్ 13 (నవగీతం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మెట్ పల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఎలాగందుల అజయ్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు. మట్టి విగ్రహాల వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రజల్లో పర్యావరణ...