navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 4:44 pm Digital Edition : NAVAGEETAM

మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రం శివారులోని పెద్ద చెరువు లో ఆదివారం చేపల వేట కు వెళ్లిన మత్స్యకారులకు 15 కిలోల భారీ చేప చిక్కింది. వారి కథనం మేరకు గత రెండు, మూడేళ్ళుగా పెద్ద చెరువులో నీరు ఎక్కువగా ఉన్నందున చేపలను పెట్టలేదని, అందుకే చేపలు 5 నుంచి 15 కిలోల వరకు పెరిగాయని తెలిపారు. ఆదివారం స్థానిక మత్స్యకారులు(గంగపుత్రులు) చేపలు పట్టేందుకు వల వేయగా, 15 కిలోల భారీ చేప చిక్కిందని గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఎల్ల ఆశాలు, కార్యదర్శి న్యావనంది నికేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు న్యావనంది నడిపి నర్సయ్య, ఎల్ల చిన్న దేవయ్య, గంగాధర్, సురేష్, పెద్దిరెడ్డి, గంగారాం, పల్లికొండ నర్సయ్య, లక్ష్మీనారాయణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.