మత్స్యకారుల వలకు చిక్కిన భారీ చేప

నవగీతం, వేల్పూర్ ప్రతినిధి: వేల్పూర్ మండల కేంద్రం శివారులోని గౌరమ్మ చెరువు లో ఆదివారం చేపల వేట కు వెళ్లిన మత్స్యకారులకు 15 కిలోల భారీ చేప చిక్కింది. వారి కథనం మేరకు గత రెండు, మూడేళ్ళుగా గౌరమ్మ చెరువులో నీరు ఎక్కువగా ఉన్నందున చేపలను పట్టలేదని, అందుకే చేపలు 5 నుంచి 15 కిలోల వరకు పెరిగాయని తెలిపారు. ఆదివారం స్థానిక మత్స్యకారులు(గంగపుత్రులు) చేపలు పట్టేందుకు వల వేయగా, 15 కిలోల భారీ చేప చిక్కిందని గంగపుత్రుడు డంగు రాజేష్, రాజు, తెలిపారు....