navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 2:43 pm Digital Edition : NAVAGEETAM

మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం

నవగీతం, జగిత్యాల

ఇటీవల జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఎన్నికైన నూతన కార్యవర్గం సభ్యులు సోమవారం కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు.ఈ సందర్బంగా నూతన కార్యవర్గానికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలుపుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియా అని సమాజంలో ఉన్న ప్రజా సమస్యలను పత్రికల ద్వారా తెలియజేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో అధ్యక్షుడు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కందుకూరి శశిధర్, ఉపాధ్యక్షులు ముసిపట్ల దేవేందర్, బద్దెనపల్లి మల్లేశం, శనిగరపు శ్రీనివాస్, కోశాధికారి శ్రీధర్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కడార్ల రంజిత్ కుమార్, సంయుక్త కార్యదర్శులు బద్దం నారాయణరెడ్డి, గాజుల మహేష్. కార్యవర్గ సభ్యులుగా నీరటి గంగాధర్, కల్లెడ హరీష్, ఎల్ల క్రాంతి కుమార్, సామ మహేష్, వాసం రఘు, ఎండి సాబేర్ లు పాల్గొన్నారు.