మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా కొండూరి రాజేష్
నవగీతం,కొడిమ్యాల జగిత్యాల జిల్లా మల్యాల–కొడిమ్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా కొడిమ్యాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు కొండూరి రాజేష్ ను అధికారికంగా నియమించారు. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న రాజేష్‌కు ఈ అవకాశం కల్పించడంపై మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కీలక పాత్ర పోషించినట్లు వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా కొండూరి రాజేష్...