navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 1:14 pm Digital Edition : NAVA GEETAM

మల్లాపూర్‌లో గిరిజన మినీ గురుకులం,మోడల్ స్కూల్‌ను పరిశీలించిన కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల/మల్లాపూర్, అక్టోబర్07,(నవగీతం): 

మల్లాపూర్ మండలంలోని గిరిజన మినీ గురుకులం, టీజీ మోడల్ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం సందర్శించి, విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, మౌలిక వసతులను పరిశీలించారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధనా విధానం, విద్యార్థుల విద్యా ప్రగతి, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా పరిస్థితులు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, భోజనం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, బోధనా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని, విద్యార్థులలో విద్యా సామర్థ్యాలు పెంపొందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు.

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యా సంస్థల్లో అవసరమైన అన్ని వసతులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

ఈ పరిశీలనలో జిల్లా ట్రైబల్ వెల్ఫెర్ ఆఫీసర్ పల్లికొండ నరేష్, జిల్లా విద్యాధికారి కె. రాము, తహసీల్దార్, ఎంపిడివో, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు.