navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:38 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వికాస్ మోడల్ స్కూల్‌లో బోనాల పండుగ

మల్లాపూర్,ఆగస్టు8,(నవగీతం): మండల కేంద్రంలోని వికాస్ మోడల్ స్కూల్‌లో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల్లో పండుగ ఉత్సాహాన్ని నింపాయి.ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు వివిధ రకాల సాంప్రదాయ వేషధారణలతో అలరించారు. బోనాల పండుగ విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల కరస్పాండెంట్ సింగారపు అశోక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలు, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.