మల్లాపూర్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టాలి
ప్రభుత్వ భూములను పరిరక్షించాలి.. ఎంపీడీఓకు మాజీ ఎంపీటీసీ మోరపు గంగరాజం వినతి మల్లాపూర్, నవంబర్ 9 (నవగీతం): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని గాంధీనగర్ పక్కన, బర్లమందా సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని కాపాడేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీటీసీ మోరపు గంగరాజం కోరారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లాపూర్ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములు క్రమంగా కబ్జాలకు గురవుతున్నాయని...