మల్లాపూర్లో వైభవంగా బోనాల పండుగ వేడుకలు
భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకున్న మహిళలు.. డప్పు చప్పుళ్ల నడుమ ఘనంగా ర్యాలీ మల్లాపూర్,అక్టోబర్14,(నవగీతం ప్రతినిధి): మల్లాపూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది మహిళలు బోనాలను ఎత్తుకొని స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి పాత బస్టాండ్ వరకు డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా ర్యాలీ...