మల్లాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఘన సన్మానం

నవగీతం, మల్లాపూర్: ఇటీవల నూతనంగా ఎన్నికైన మల్లాపూర్ మండల టియూడబ్ల్యూజే (హెచ్ 143) ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను, జగిత్యాల జిల్లా స్పెషల్ బ్రాంచ్ రిటైర్డ్ ఏఎస్ఐ సామాజిక సేవకుడు రాజేశుని శ్రీనివాస్ సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ బాధ్యులకు ఆయన శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమాజంలో ఎదురయ్యే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. నూతన కార్యవర్గం బాధ్యతాయుతంగా పనిచేస్తూ, జర్నలిజం విలువలను...