navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 4:36 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మల్లాపూర్ మండల ప్రజలకు శుభవార్త..

నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ

మల్లాపూర్,ఆగస్టు8,(నవగీతం): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మల్లాపూర్ మండలంలో అర్హులైన అభ్యర్థుల నుంచి నూతన పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి(ఎంపీడీఓ)అలువాల శ్రీకాంత్ తెలిపారు.అర్హత కలిగిన వారికి నూతన పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. నూతనంగా దరఖాస్తు చేసుకునే వారిలో వితంతు,ఒంటరి మహిళ,వికలాంగులు,చేనేత కార్మికులు,కల్లుగీత కార్మికులు,ఫైలేరియా, హెచ్‌ఐవీ బాధితులు,డయాలసిస్ కేటగిరీలకు చెందిన అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.దరఖాస్తుతో జత చేయాల్సిన పత్రాలు 1,దరఖాస్తు ఫారం 2,ఆధార్ కార్డు 3,బ్యాంకు ఖాతా వివరాలు 4,వయస్సు ధ్రువీకరణ పత్రం 5,రేషన్ కార్డు/ఆదాయ ధ్రువీకరణ పత్రం 6,సంబంధిత కేటగిరీ ధ్రువీకరణ పత్రం — సదరం,యూడీఐడీ, వితంతు, దివ్యాంగ, చేనేత,కల్లుగీత తదితర ధ్రువీకరణ పత్రాలు అర్హులైన అభ్యర్థులు నూతన దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను జతచేసి తమ గ్రామ పంచాయితీ కార్యదర్శికి అందజేయాలని ఎంపీడీఓ అలువాల శ్రీకాంత్ సూచించారు.దరఖాస్తులు, అర్హతలు, ఇతర వివరాల కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో లేదా మల్లాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.