మల్లాపూర్ మండల మైనారిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అమీన్ ఎన్నిక
మల్లాపూర్, సెప్టెంబర్ 24 (నవగీతం): మల్లాపూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మైనారిటీ సంఘం మండల కమిటీ ఎన్నికల్లో రాఘవపేటకు చెందిన మహమ్మద్ అమీన్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. కమిటీ నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ, మరో ఉపాధ్యక్షుడిగా షేక్ ఫరీద్ , జనరల్ సెక్రటరీగా మహమ్మద్ సల్మాన్ , క్యాషియర్‌గా మహమ్మద్ అంకుష్, కార్యదర్శిగా షేక్ ఇమామ్ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా మహమ్మద్ రఫీ మహమ్మద్ మహబూబ్ లను ఎన్నుకున్నారు....