మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.

లైంగిక వేధింపుల నిరోధక చట్టం గోడ పత్రిక ఆవిష్కరణ నవగీతం,జగిత్యాల సంక్రాంతి పండగను పురస్కరించుకుని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ సముదాయంలో మహిళా ఉద్యోగినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కేవలం సంప్రదాయ ముగ్గులకే పరిమితం కాకుండా, "పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం - 2013" (POSH Act) అనే సామాజిక ఇతివృత్తంతో (Theme) ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దంపతులు పాల్గొని, మహిళా...