మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం:
జువ్వాడి కృష్ణారావు నవగీతం, మల్లాపూర్: మహిళా సంఘాల బలోపేతానికి మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని సీనియర్ నాయకులు కృష్ణారావు అన్నారు.మల్లాపూర్ మండలంలోని రత్నాపూర్ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి జువ్వాడి కృష్ణారావు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ సంఘ భవనాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు....