navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 8:03 am Digital Edition : NAVAGEETAM

మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

ఇందిరమ్మ చీరలు పంపిణీ

నవగీతం, మల్లాపూర్

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ  ద్వారా ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను కానుకగా అందజేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు.అందులో భాగంగా మల్లాపూర్ మండలం రాఘవపెట్ గ్రామంలో చీరలు పంపిణీ చేశారు.మహిళల గౌరవం, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నత్తి రాము ,నత్తి లక్ష్మణ్ ,రాజుల గంగాధర్ కిలేటి రాజన్న, గంగాధర్ ఎదిలాపురం రవి, జంబరత్ ప్రశాంత్ గురజాల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.