navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 10:52 pm Digital Edition : NAVAGEETAM

మహిళా సంఘాల భవనాలకు భూమిపూజ

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండల కేంద్రంలో  ఈజీఎస్ నిధులతో నిర్మించే ఐదు మహిళా సంఘాల భవనాలకు గురువారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ భూమిపూజ చేశారు. సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మాణం చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ముఖ్యమన్నారు. మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి మూలస్తంభమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.డీ.ఓ శ్రీకాంత్,మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్,ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, మండల మహిళా సమైఖ్య అధ్యక్షురాలు తేజ శ్రీ, ఏ.పీ.ఎం విమోచన, సీ.సీ పుష్పలత, సి.ఏ వసంత,ప్రవళిక, జయ, కృష్ణవేణి,వసంత, రోజా, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.