మహిళా సంఘాల భవనాలకు భూమిపూజ
నవగీతం, మల్లాపూర్ మల్లాపూర్ మండల కేంద్రంలో ఈజీఎస్ నిధులతో నిర్మించే ఐదు మహిళా సంఘాల భవనాలకు గురువారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ భూమిపూజ చేశారు. సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మాణం చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ముఖ్యమన్నారు. మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి మూలస్తంభమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.డీ.ఓ శ్రీకాంత్,మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్,ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, మండల...