మాదకద్రవ్యాల నిర్మూలనకు సమిష్టి కృషి

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి : జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సమిష్టి కృషితో ముందుకెళ్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్  బి. సత్యప్రసాద్ , జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల...