మార్కండేయుని ధర్మనిష్ట యువతకు స్ఫూర్తిదాయకం

బీసీ జేఏసీ చైర్‌ పర్సన్‌ దాసరి ఉష ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు నవగీతం,పెద్దపల్లి: మృత్యువును జయించిన చిరంజీవి,భక్త మార్కండేయ మహర్షి ఆశీస్సులు సమాజంపై ఎల్లప్పుడూ ఉండాలని బీసీ జేఏసీ చైర్‌ పర్సన్‌ దాసరి ఉష ఆకాంక్షించారు.బుధవారం జిల్లా కేంద్రంలోని పద్మశాలీ భవనంలో మార్కండేయ జయంతి వేడుకలను పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షులు బత్తుల రమేష్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో భాగంగా పద్మశాలీ భవనంలో ప్రత్యేక హోమం,పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దాసరి ఉష స్వామివారిని దర్శించుకుని పూజల్లో...