navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 5:28 pm Digital Edition : NAVAGEETAM

మాస్టర్ కాన్వెంట్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ గ్రామంలోని మాస్టర్ కాన్వెంట్ స్కూల్లో సోమవారం యూకేజీ పిల్లలకి ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు కరస్పాండెంట్ పురుషోత్తం ప్రధానం చేశారు. అలాగే ప్రతి తరగతిలో ఫస్ట్ సెకండ్ ర్యాంకు సంపాదించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ మరియు సిల్వర్ మెడల్ ప్రధానం చేయడం జరిగింది ఈ సందర్భంగా తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే సెలవు దినాలలో పిల్లలు వివిధ రకాల ఆక్టివిటీ నేర్చుకోవడంలో తల్లిదండ్రులు సహాయపడాలని ప్రతి రోజు కొద్ది సమయం చదవడం రాయడం అనేది తప్పనిసరిగా చేపించాలని అన్నారు విద్యార్థులను ఫోన్లకు దూరంగా ఉంచాలని వాళ్ళు చేసే ప్రతి పనిని గమనించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పావని, స్వప్న, దివ్య, మాధురి. మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు