“మా కష్టం మాకు దక్కాలి” – అధిక తరుగు వ్యతిరేకంగా రైతుల నిరసన
నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం కోడిమ్యాల మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధిక తరుగు (కటింగ్) విధింపుపై రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. ధాన్యం తూకంలో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద నిరసన చేపట్టారు. వర్షాకాలంలో మాత్రమే ధాన్యంలో లోపాలు ఉన్నపుడు తరుగు విధించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, ఎండాకాల పంటకు కూడా ప్రతి క్వింటాల్‌కు 2–3 కిలోల వరకు తరుగు తీస్తుండటం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా, “లోడ్లు...