ముందస్తు యాసంగి వరి సాగు–రైతులకు నిపుణుల సూచనలు

నవగీతం,కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం, గౌరాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు కాసాని శేఖర్ యాసంగి వరిని ముందస్తుగా సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఆయన అక్టోబర్ 16న “జె జి ఎల్ 24423” అనే చలికి తట్టుకునే వరి వంగడాన్ని నారు పోసి, నవంబర్ 18న ఐదు ఎకరాల విస్తీర్ణంలో నాట్లు వేశారు.సాధారణంగా తెలంగాణలో యాసంగి వరిని డిసెంబర్ మొదటి వారంలో నారు పోసి, జనవరి మొదటి వారంలో నాట్లు వేయడం రైతులు అనుసరిస్తున్న విధానం. అయితే, దీనికి భిన్నంగా ముందస్తు సాగు...