ముఖ్యమంత్రి కి చెల్లెలిగా రాఖీకట్టిన జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్
జగిత్యాల,ఆగస్టు28,(నవగీతం): రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి చెల్లెలిగా రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి ఆనందంగా జరుపుకున్నారు.అంతకుముందు శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో అడువాల జ్యోతి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని,రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా అడువాల జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం నెలకొనాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు.