ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
నవగీతం,చొప్పదండి: చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 35 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF)చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పిసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నూతన మండల, పట్టణ అధ్యక్షుల ఎన్నికకై అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నిజానపురం...