ముగిసిన మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు

రాష్ట్రస్థాయిలో రాణించాలి: తహసిల్దార్ కిరణ్ కుమార్ నవగీతం,కొడిమ్యాల: కొడిమ్యాల మండల స్థాయి సీఎం కప్–2వ ఎడిషన్ ఎంపిక క్రీడా పోటీలు మంగళవారం విజయవంతంగా ముగిశాయి.ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో మధ్యాహ్నం 3 గంటలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి ఐత శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా మండల తహసిల్దార్ కిరణ్ కుమార్ హాజరై మాట్లాడారు.క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు...