మున్సిపల్ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలి

జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్ సూచించారు. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మెట్ పల్లి  మున్సిపల్ పరిధిలో బ్యాలెట్ పేపర్ వెరిఫికేషన్ ను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజగౌడ్ పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సంఖ్య, నాణ్యతను జాగ్రత్తగా పరిశీలించారు. ఎటువంటి లోపాలు లేకుండా ముందస్తు తనిఖీలు నిర్వహించాలన్నారు....