మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఎస్పీ పోటీ
జిల్లా అధ్యక్షుడు రాజనర్సయ్య నవగీతం,పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు బీఎస్పీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల రాజనర్సయ్య వెల్లడించారు.ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాజనర్సయ్య మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ సహా మంథని,పెద్దపల్లి,సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లోని అన్ని కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు బీఎస్పీ అభ్యర్థులను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి,అధికారంలోకి...