navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 8:48 am Digital Edition : NAVAGEETAM

మున్సిపల్ కార్మిక సంఘం నూతన కార్యవర్గానికి బిజెపి నాయకుల ఘన సన్మానం

నవగీతం, మెట్‌పల్లి ప్రతినిధి :

మెట్‌పల్లి పట్టణ మున్సిపల్ కార్మిక సంఘం నూతన కార్యవర్గ సభ్యులను గురువారం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో బిజెపి నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూదరి అరుణ, డాక్టర్ అనుప్ రావు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో మరియు పరిశుభ్రతలో మున్సిపల్ కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి నూతన కార్యవర్గం అంకితభావంతో పనిచేయాలని వారు ఆకాంక్షించగా, జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పోరాటంలో బిజెపి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోడ్ల రమేష్, ధర్మపురి స్వరూప, అరిసె వనజతో పాటు నాయకులు ధర్మపురి వేణుగోపాల్, బోడ్ల నాగేష్, అరిసె మురళి, లింగేశ్వర్, సదాశివ్, సత్యనారాయణ, రాకేష్, అనిల్, విజయ్, పార్టీ కార్యకర్తలు మరియు కార్మిక సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.