మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు పాత్రికేయులను ఆహ్వానించాలి
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ప్రతినెల జరిగే మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశానికి పత్రిక విలేఖరులను ఆహ్వానించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని 50 వార్డు కౌన్సిలర్ ములస్తం లావణ్య మహేష్ శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ కు వినతిపత్రం అందించారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల మాదిరిగానే మున్సిపల్ సాధారణ సమావేశాలకు కూడా పత్రికా విలేఖరులను ఆహ్వానిస్తే, సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండి, సమిష్టి నిర్ణయాలు పట్టణ ప్రజలకు కూడా తెలియపరచడం జరుగుతుందన్నారు. వివిధ వార్డులలో జరిగే, జరుగబోయే అభివృద్ధి పనులు, సంక్షేమ...