మున్సిపాలిటీ ఎన్నికలలో సిపిఐ పోటీకి సిద్ధం యర్రా బాబు
నవగీతం,వైరా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైరా మున్సిపాలిటీలో బలమున్న వార్డులలో సిపిఐ పోటీ చేస్తుందని సిపిఐ వైరా నియోజకవర్గ ఇన్చార్జి యార్రబాబు అన్నారు బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో మాచర్ల నాగభూషణం అధ్యక్షతన జరిగిన మున్సిపాలిటీ కార్యవర్గ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలలో కలిసివచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికలలో పోటీ చేసి సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బలమున్న వార్డులలో ఎన్నికల పొత్తులు కుదరని పక్షంలో ఒంటరిగానైనా పోటీ చేయటానికి సిద్ధంగా ఉండాలని సమావేశంలో పాల్గొన్న పలువురు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు...