navageetam.com
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 4:58 pm Digital Edition : NAVA GEETAM

మూడు చేతిపంపులకు మరమ్మతులు..

ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన గ్రామ పంచాయతీ

నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి – సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్

మల్లాపూర్, నవంబర్ 3 (నవగీతం):

మల్లాపూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూడు చేతిపంపులకు మరమ్మతులు చేయించారు. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమారెడ్డి, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు.

గ్రామంలోని 14వ వార్డు, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం మూడు చేతిపంపులకు మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో 14వ వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మి-ఏవీఆర్, కార్యదర్శి గూరుడు శ్రీనివాస్, కాషవత్తుల లక్ష్మి-గంగారెడ్డి, భుక్యా శేఖర్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.