మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం 

ఇబ్రహీంపట్నం ఆగష్టు 20 (నవగీతం):పొట్ట కూటికోసం దుబాయ్ వెళ్లిన ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన జవ్వాజి శ్రీనివాస్, ఇటీవల దుబాయ్ లో మృతి చెందాడు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి. తల్లిదండ్రుల నీడను కోల్పోయిన నలుగురి చిన్నారులకు మీకు అండగా మేమున్నామంటూ గ్రామస్తులు భరోసా ఇచ్చారు.కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. జవ్వాజి శ్రీనివాస్, భార్య కూడా గతంలో మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలు,ఇద్దరు కుమారులు,తల్లిదండ్రుల ప్రేమకు దూరమై, చివరకు...