మృతుని కుటుంబాన్ని పరామర్శించిన దాసరి ఉష

నవగీతం, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు బూరుగు సదయ్య గౌడ్ నాలుగు రోజుల క్రితం తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన విషయం తెలిసిందే.ఈ విషయం తెలుసుకున్న బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్మన్ దాసరి ఉష మంగళవారం అప్పన్నపేట గ్రామానికి వెళ్లి సదయ్య గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి భార్య కవిత, కుమారులు సందీప్,శ్రీనాథ్‌లను ఆమె ఓదార్చి,వారికి ధైర్యం చెప్పారు.ఒక పేద గీత కార్మిక కుటుంబానికి జరిగిన ఈ నష్టం పూడ్చలేనిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.కుల...