మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి

బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం: మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల/ఎండపల్లి,సెప్టెంబర్14,(నవగీతం): వెల్గటూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల మరణించగా ఎండపల్లి మండలం లోని గుల్లకోట గ్రామంలో మృతుని కుటుంబాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని మంత్రి తెలిపారు. మృతుని కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ. 50వేల   ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న సింహాచలం జగన్  కుటుంబానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని మంత్రి తెలిపారు. గుల్లకోట గ్రామానికి చెందిన పొన్నం నారాయణ గౌడ్ ఇటీవల మరణించగా మంత్రి లక్ష్మణ్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి వెంట ఎండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జల్లి శేఖర్, వెల్గటూర్ మండల పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, పొన్నం మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.