navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 2:25 pm Digital Edition : NAVAGEETAM

మెట్‌పల్లిలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్‌కు బాడీ ఫ్రీజర్ వితరణ

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అమావాస్య సందర్భంగా శ్రీ కర్బల దేవస్థానం (బర్దిపూర్) ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం భర్తీపూర్ గ్రామానికి చెందిన మోహన్ యోగి తండ్రి సొంతి సాయిరాం జ్ఞాపకార్థంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్‌కు శనివారం బాడీ ఫ్రీజర్‌ను వితరణ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, మోహన్ యోగిని శాలువాతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ట్రస్ట్ సభ్యుల సేవా భావాన్ని కొనియాడుతూ, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మరింత కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నవీన్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.