మెట్‌పల్లిలో ఘనంగా తెలుగు ప్రతిభా పరీక్షలు

విద్యార్థుల్లో మాతృభాషపై మక్కువ పెంపొందించాలి: డిఈవో కె.రాము నవగీతం, మెట్ పల్లి: మెట్‌పల్లి డివిజన్ స్థాయి తెలుగు ప్రతిభా పరీక్షలు తెలుగు ఫోరం డివిజన్ అధ్యక్షులు చొప్పరి శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా విద్యాధికారి కె. రాము ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.ఈ సందర్భంగా డిఈవో మాట్లాడుతూ నాణ్యమైన విద్య ఎంతో అవసరమని, విద్యార్థులు కనీస సామర్థ్యాలలో నైపుణ్యత సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నట్లుగా మాతృభాష ఔన్నత్యం...