మెట్‌పల్లిలో చైనా మాంజా బీభత్సం: నాలుగేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు, విక్రేత పై కేసు నమోదు
నవగీతం,మెట్ పల్లి సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా విక్రయాలు ఒక చిన్నారి ప్రాణం మీదకు తెచ్చాయి. మెట్‌పల్లి పట్టణానికి చెందిన జెట్టి లింగం మనవడు, నిజామాబాద్ నివాసి వోడ్దేపు శ్రీకాంత్ కుమారుడైన శ్రీహన్ (4) గురువారం దుబ్బవాడలోని తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా, గాలిపటం నుండి తెగిపడిన చైనా మాంజా దారం బాలుడి మెడకు బలంగా చుట్టుకుంది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.ఈ...