మెట్‌పల్లిలో పలువురికి ఘన సన్మానం
నవగీతం, మెట్ పల్లి: ఇటీవల నూతనంగా ఎన్నికైన చైతన్య నగర్-1 సంఘం అధ్యక్షులు పుల్లూరి నవీన్, కార్యదర్శి ఎల్మి రవి, కోశాధికారి నరేంద్రల రవి లను మెట్‌పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కోట సుమన్ వారి నివాసంలో ఘనంగా సన్మానించారు.అదేవిధంగా వాసవి క్లబ్ జోన్ చైర్మన్‌గా నియమితులైన కోట కిరణ్ కుమార్, జిల్లా ప్రెస్ అక్రిడిటేషన్ కమిటీ సభ్యునిగా నియమితులైన బండారి శివ కుమార్ ఉత్తమ విలేకరిగా పురస్కారం అందుకున్న బాశెట్టి హరీష్ ను శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు....