మెట్‌పల్లిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి : మెట్‌పల్లి పట్టణంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందిస్తున్న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.డి. షాకీర్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అలాగే మహిళా మండలి, అంగన్వాడీ కేంద్రాలలో కేక్ కట్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో సోనియా గాంధీ సమైక్య...