మెట్‌పల్లి చైనా మాంజా కేసులో పురోగతి: నిర్మల్‌లో ప్రధాన సరఫరాదారు అరెస్ట్

నవగీతం మెట్ పల్లి మెట్‌పల్లి పట్టణంలో నాలుగేళ్ల బాలుడు శ్రీహన్ మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్రంగా గాయపడిన ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే స్థానిక విక్రేత షేక్ సిద్ధిక్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనిచ్చిన సమాచారం మేరకు ఈ ప్రమాదానికి కారకమైన నిషేధిత మాంజాను సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. స్థానిక విక్రేత సిద్ధిక్ హుస్సేన్ విచారణలో భాగంగా తాను గత కొంతకాలంగా నిర్మల్ పట్టణానికి చెందిన ఎం.డి. ఫిరోజ్ ఖాన్...