మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్‌కు ఘన సన్మానం
నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: మెట్‌పల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన డి. శ్రీనివాస్ గౌడ్ ను బుధవారం పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, వారి పదవీకాలంలో పట్టణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పులిమామిడి ప్రవీణ్ కుమార్ (పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్, కాకతీయ యూనివర్సిటీ), ఆర్. మహేష్ (ఎస్.ఏ సోషల్ గవర్నమెంట్ టీచర్), తునికి శ్రీనివాస్...