navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 9:08 am Digital Edition : NAVAGEETAM

మెట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం -ఒకరు మృతి

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఐచర్ వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో మెట్‌పల్లికి చెందిన సాగర్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ ప్రమాదంలో శివ అనే మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనతో పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి.