మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి నవగీతం,మెట్ పల్లి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పరిష్కరించాలని, నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ తనఖీ చేశారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక...