మెట్ పల్లి మున్సిపల్ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్మికుల ఐక్యతను చాటుతూ జరిగిన ఈ ఎన్నికలో సంఘం అధ్యక్షునిగా లంక శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా ఉల్లెందుల శ్రీనివాస్, కార్యదర్శిగా ఏ. అనిల్, క్యాషియర్‌గా లంక సంజీవ్ ఎన్నికయ్యారు. అలాగే సలహాదారులుగా వాల్గోట్ నరేష్, పానుగంటి గంగాధర్, షకీల్‌లను నియమించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ నాయకుడు ఉస్మాన్ మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమం కోసం అంకితభావంతో...