navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 1:06 pm Digital Edition : NAVAGEETAM

మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గుండె వైద్య శిబిరం

నవగీతం, మెట్ పెళ్ళి

ప్రజల్లో పెరుగుతున్న గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పిస్తూ స్థానికంగా నాణ్యమైన కార్డియాలజీ సేవలు అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెట్‌పల్లిలోని తిరుమల నర్సింగ్ హోమ్‌లో గుండె వ్యాధులపై ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.ఇందులో ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నితిన్ అన్నారపు పాల్గొని గుండె సమస్యలతో బాధపడుతున్న రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే నిపుణుల సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ నితిన్ అన్నారపు మాట్లాడుతూ గుండె జబ్బులు ఉన్నవారు లేదా గుండె సంబంధిత లక్షణాలు కనిపించే వారు సరైన సమయంలో నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో కీలకం అని నడిచేటప్పుడు ఆయాసం రావడం, ఛాతిలో భారంగా అనిపించడం, దవడ లేదా చేతులకు నొప్పి వ్యాపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా బీపీ, షుగర్, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది రోగులు ప్రయోజనం పొందారని, భవిష్యత్తులో కూడా ఇటువంటి వైద్య సేవలను కొనసాగిస్తామని మెడికవర్ హాస్పిటల్స్ ప్రతినిధులు తెలిపారు