మెడిసిన్ అప్డేట్- 2026 లో డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురణ.
నవగీతం, జగిత్యాల జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ భీమనాతిని శంకర్ కు అరుదైన అవకాశం దక్కింది. మెడిసిన్ అప్డేట్ - 2026 వైద్య గ్రంథంలో డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురితమైంది. వైద్య రంగంలో కొత్త కొత్త అంశాలు, ఆవిష్కరణలతో ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలోని జేపీ బ్రదర్స్ ద్వారా ప్రచురితమయ్యే మెడిసిన్ అప్డేట్ 2026 వైద్య గ్రంథంలో డాక్టర్ శంకర్ వ్రాసిన "శ్వాసకోశ ఉబ్బస వ్యాధులు - ఆధునిక చికిత్స పద్ధతులు"అనే వ్యాసం ప్రచురితమైంది. ఈ వైద్య గ్రంధాన్ని ఈనెల 29న బీహార్ రాజధాని...