మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధం
హోటల్స్,దుకాణదారులు సహకరించాలని విజ్ఞప్తి నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మేజర్ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అన్ని కిరాణా షాపులు ఇతర దుకాణదారుల దగ్గరకు వెళ్లి ప్లాస్టిక్ నిషేధం గురించి వివరిస్తూ ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగి నష్టాలు తెలుపుతూ షాప్ యజమానులు హోటల్ నిర్వాహకులు ప్రతి ఒక్కరు పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించి గ్రామపంచాయతీ కి సహకరించాలని కోరారు.ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలలో అవగాహన పెంచడం ద్వారా ప్లాస్టిక్ రహిత గ్రామాలను రూపొందించవచ్చని బాధ్యతగా...